logo

Hyderabad News: స్వాతంత్ర్యానికి ముందు హైదరాబాద్‌లో ధరలు ఇలా..

ఇప్పుడైతే వంద.. రెండు వందలు ఖరీదు ఉన్నా సరే.. ఏ వస్తువునైనా కొనటానికి సంకోచించడం లేదు. ఎవరి చేతిలో చూసినా రూ.10వేలపైనే విలువ కలిగిన సెల్‌ఫోన్లు కనిపిస్తుంటాయి. స్వాతంత్య్రానికి పూర్వం ఇలా కాదు. రూపాయి చేతిలో ఉంటే అదే పెద్ద భాగ్యం.

Updated : 11 Aug 2022 09:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇప్పుడైతే వంద.. రెండు వందలు ఖరీదు ఉన్నా సరే.. ఏ వస్తువునైనా కొనటానికి సంకోచించడం లేదు. ఎవరి చేతిలో చూసినా రూ.10వేలపైనే విలువ కలిగిన సెల్‌ఫోన్లు కనిపిస్తుంటాయి. స్వాతంత్య్రానికి పూర్వం ఇలా కాదు. రూపాయి చేతిలో ఉంటే అదే పెద్ద భాగ్యం. ఆ రోజుకు ఇళ్లు బ్రహ్మాండంగా గడిచేది. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధకాలం (1939-1945).. అంటే భారత్‌కు స్వాతంత్య్రం రాక పూర్వం హైదరాబాద్‌ నగరంలో బంగారం నుంచి నిత్యావసర వస్తువుల వరకు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కొంత ఆసక్తే. యుద్ధం ముందు వరకు ధరలు సాధారణంగానే ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైన 16 నెలల తర్వాత ధరలు పెరిగాయి. దీంతో అప్పటి ప్రభుత్వం ధరలపై నియంత్రణ పెట్టింది. బ్లాక్‌మార్కెట్‌, కల్తీలు లాంటివి కూడా మొదలయ్యాయి. ఆనాటి ధరలు గురించి తన...‘50 సంవత్సరాల హైదరాబాద్‌’ అన్న పుస్తకంలో మందుముల నరసింగరావు అనే రచయిత సవివరంగా పేర్కొన్నారు.

* ప్రస్తుత ధరలతో పోల్చితే అప్పటి ధరలు ఎంతో తక్కువనే ఆశ్చర్యం కలగకమానదు.. అయితే ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకుంటే అప్పటి ధరలు ఇప్పటి ధరలతో సరిసమానంగానే భావించాలి.

* మరోవైపు స్వాతంత్య్రానికి పూర్వం ప్రజల కొనుగోలు శక్తి చాలా తక్కువగా ఉండేదని రచయిత పుస్తకంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిని బట్టి పరాయి పాలన కారణంగా ప్రజలకు ఉపాధి కరవై.. పేదరికంలో మగ్గేవారని స్పష్టమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని