logo

చిత్ర వార్తలు

రాయదుర్గం ప్రాంతంలో రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన చెట్లను దుర్గం చెరువు తీగల వంతెన పరిసరాల్లో నాటారు. ఇటీవల వర్షాలకు అవి మళ్లీ చిగురించి పచ్చదనాన్ని సంతరించుకున్నాయి.

Updated : 11 Aug 2022 04:09 IST

సిద్ధించిన పచ్చని సంకల్పం

రాయదుర్గం ప్రాంతంలో రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన చెట్లను దుర్గం చెరువు తీగల వంతెన పరిసరాల్లో నాటారు. ఇటీవల వర్షాలకు అవి మళ్లీ చిగురించి పచ్చదనాన్ని సంతరించుకున్నాయి.


అంతటా మిరుమిట్లు.. వంతెనపై చీకట్లు

ఓవైపు స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నగరాన్ని త్రివర్ణ వెలుగుల్లో నింపుతుండగా జేఎన్‌టీయూ వంతెనపై వీధిదీపాలు వెలగడం లేదు. అంధకారంగా మారిన రహదారిపై వాహనాల లైట్లే దారి చూపుతున్నాయి. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన దీపాలు పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు.


వెలుగుల వెనుక ‘వ్యాపారం’

సికింద్రాబాద్‌ కార్ఖానా వద్ద బస్‌షెల్టర్‌లో ప్రకటనల కోసం ఏర్పాటు చేసిన బాక్స్‌లో పట్టపగలే వెలుగుతున్న ఎల్‌ఈడీ దీపాలు. ప్రకటనల కోసం బస్‌షెల్టర్‌ను కాంట్రాక్టు తీసుకున్న సంస్థలు ప్రకటనదారులను ఆకర్షించేందుకు నగరంలో ఇలా పలుచోట్ల విద్యుత్తు వృథా చేస్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.


స్ఫూర్తిదాయకం.. త్రివర్ణ శోభితం..

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా తాండూరు పట్టణంలో రెండో రోజు ప్రధాన వీధుల్లో 75 మీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. భద్రేశ్వర దేవాలయం నుంచి వివిధ కూడళ్ల మీదుగా పతాకాన్ని ఊరేగించారు. విద్యార్థులు జాతీయ నినాదాలతో హోరెత్తించారు. ఆయా కార్యక్రమాల్లో పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు దీప, కౌన్సిలర్లు, పురపాలక సంఘం అధికారులు తదితరులున్నారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటాలన్నారు.

- న్యూస్‌టుడే, తాండూరు టౌన్‌

 


‘ఆకు’పచ్చని బంగారం... అవనికే సింగారం

తాండూరు మండల పరిధి గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో లోతట్టునున్న పొలాలు ముంపునకు గురై రైతులు నష్టపోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఎగువనున్న పంట పొలాలు అందుకు భిన్నంగా పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. బిజ్వార్‌లో కంది, పెసర, జొన్న పొలాలు కనుచూపుమేరలో లేత ఆకుపచ్చని మొక్కలతో కనువిందు చేస్తున్నాయి. కళకళలాడుతున్న పొలాలను చూసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

-న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని