logo

హైదరాబాద్‌ వేదికగా.. రొమ్ము క్యాన్సర్‌పై జాతీయ సదస్సు

భాగ్యనగరం మరో జాతీయ సదస్సుకు వేదిక కానుంది. అసోసియేషన్‌ ఆఫ్‌ బ్రెస్ట్‌ సర్జన్స్‌ పదో జాతీయ వార్షిక సదస్సును ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు.

Updated : 11 Aug 2022 04:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: భాగ్యనగరం మరో జాతీయ సదస్సుకు వేదిక కానుంది. అసోసియేషన్‌ ఆఫ్‌ బ్రెస్ట్‌ సర్జన్స్‌ పదో జాతీయ వార్షిక సదస్సును ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. తొలిరోజు సదస్సును వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. సదస్సులో దేశ, విదేశాల నుంచి దాదాపు 500 మంది రొమ్ము క్యాన్సర్‌ శస్త్ర చికిత్స నిపుణులు, రేడియాలజిస్టులు, ఆంకోప్లాస్టిక్‌ బ్రెస్ట్‌ సర్జన్లు హాజరవుతారని సదస్సు ఆర్గనైజింగ్‌ కమిటీ ఛైర్మన్‌, కిమ్స్‌ ఉషాలక్మి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రఘురాం తెలిపారు. రొమ్ము కేన్సర్‌ విజేత, ప్రముఖ నర్తకి డాక్టర్‌ ఆనంద శంకర్‌ జయంత్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ ఉషాలక్ష్మి గౌరవార్థం బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై ఉపన్యాసం చేయనున్నారని చెప్పారు. ప్రఖ్యాత యూకే అంకోప్లాస్టిక్‌ బ్రెస్ట్‌ సర్జన్‌ ప్రొఫెసర్‌ క్రిస్‌ హోల్‌కోంబ్‌ ప్రసంగించనున్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని