logo

తగ్గిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు

 నగరంలో వరసగా రెండోనెల ఇళ్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఈ ఏడాదిలోనే జులైలో రిజిస్ట్రేషన్లు అత్యల్పంగా నమోదయ్యాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా  నివేదికలో పేర్కొంది.

Updated : 11 Aug 2022 04:08 IST

ఈనాడు, హైదరాబాద్‌:  నగరంలో వరసగా రెండోనెల ఇళ్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఈ ఏడాదిలోనే జులైలో రిజిస్ట్రేషన్లు అత్యల్పంగా నమోదయ్యాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా  నివేదికలో పేర్కొంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో జులైలో 4,313 అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు రిజిస్టర్‌ అయ్యాయని,   విలువ రూ.2100 కోట్లు ఉంటుందని వెల్లడించింది. విక్రయాలపరంగా క్రితం నెలతో పోలిస్తే 26 శాతం రిజిస్ట్రేషన్లు తగ్గాయని తెలిపింది. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో జనవరి నుంచి జులై వరకు 7 నెలల వ్యవధిలో రూ.20 వేల కోట్ల ఇళ్ల లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని