logo

ఉన్నత విద్యకు ఆకాశ్‌ బైజూస్‌ ఉపకార వేతనాలు

ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులు, ఒంటరి పోషకులు (తల్లి) గల బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆకాష్‌ బైజూస్‌ ఉపకార వేతనాలు కల్పిస్తోందని ఆ సంస్థ రాష్ట్ర అకడమిక్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కె.శేషగిరిరాజు,

Updated : 11 Aug 2022 04:08 IST

సోమాజిగూడ, న్యూస్‌టుడే: ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులు, ఒంటరి పోషకులు (తల్లి) గల బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆకాష్‌ బైజూస్‌ ఉపకార వేతనాలు కల్పిస్తోందని ఆ సంస్థ రాష్ట్ర అకడమిక్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కె.శేషగిరిరాజు, తెలుగు రాష్ట్రాల హెడ్‌ భరత్‌కుమార్‌, ఆపరేషన్‌ హెడ్‌ నిశాంత్‌ శ్రీవాత్సవ ప్రకటించారు. ఆకాశ్‌ బైజూస్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ టెస్ట్‌ (అంతే)-2022 స్కాలర్‌షిప్‌ పరీక్ష నవంబరులో నిర్వహిస్తున్నట్లు బుధవారం సోమాజిగూడలోని కత్రియ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలిపింది. దాదాపు 2 వేల మంది పిల్లలకు ఉపకార వేతనాలు, ఉచితంగా నీట్‌, జేఈఈ శిక్షణ అందించే దిశగా ‘అందరికీ విద్య’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణతోపాటు ఇతర ప్రాంతాల్లో 8వ తరగతి నుంచి ఇంటర్‌ చదివే వారు స్కాలర్‌షిప్‌ పరీక్ష రాయవచ్చు. అర్హత పరీక్షను నవంబరు 5 నుంచి 13వ తేదీ మధ్య ఆన్‌లైన్‌లో, 6, 13వ తేదీలలో ఆఫ్‌లైన్‌లో జరగనుందన్నారు. విద్యార్థులు anthe.aakash.ac.in వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆకాశ్‌ బైజూస్‌ ద్వారా ఉపకార వేతనాలు పొంది మెడిసిన్‌, ఇంజినీరింగ్‌ చదువుతున్న పలువురు విద్యార్థులను వారు సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని