logo
Updated : 11 Aug 2022 04:08 IST

తెలంగాణలో ప్రత్యామ్నాయం భాజపానే: దాసోజు

శంషాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా తిరుగు లేని శక్తిగా ఎదుగుతోందని దాసోజు శ్రవణ్‌ అన్నారు. దిల్లీలో భాజపా తీర్థం పుచ్చుకొని హైదరాబాద్‌కు తొలిసారి వస్తున్న క్రమంలో బుధవారం ఆయనకు శంషాబాద్‌ విమానాశ్రయంలో అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో శ్రవణ్‌ మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల కేసీఆర్‌ పాలనలో తెలంగాణ సమాజానికి ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించలేని దయనీయ స్థితిలో రాష్ట్రం ఉందని విమర్శించారు. విద్య, వైద్య రంగాలను  పూర్తిగా దెబ్బతీశారన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని