logo

నార్త్‌ కేప్‌ 4000 విజయవంతం

నగరానికి చెందిన ఇద్దరు ఔత్సాహిక సైకిలిస్టులు ఐరోపా ఖండంలోని ఆరు దేశాల మీదుగా సాగిన 3,800 కిలోమీటర్ల ‘నార్త్‌కేప్‌ 4000’ సైకిల్‌ రైడ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 22 రోజుల్లో పూర్తి చేయాల్సిన...

Updated : 11 Aug 2022 04:06 IST


యాత్ర పూర్తి చేసిన శశికాంత్‌, కృష్ణ కూనం

రాయదుర్గం, న్యూస్‌టుడే: నగరానికి చెందిన ఇద్దరు ఔత్సాహిక సైకిలిస్టులు ఐరోపా ఖండంలోని ఆరు దేశాల మీదుగా సాగిన 3,800 కిలోమీటర్ల ‘నార్త్‌కేప్‌ 4000’ సైకిల్‌ రైడ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 22 రోజుల్లో పూర్తి చేయాల్సిన సాహసయాత్రను నాలుగు రోజుల ముందే 18 రోజుల్లోనే గమ్యం చేరుకొని మన్ననలందుకున్నారు. గచ్చిబౌలి హైదరాబాద్‌ బైసైక్లింగ్‌ క్లబ్‌ (హెచ్‌బీసీ) సభ్యుడు శశికాంత్‌తోపాటు కృష్ణ కూనం ఈ సాహస యాత్రను పూర్తి చేశారు. గత నెల 23వ తేదీన ఇటలీ రోవెరీటో నగరం నుంచి యాత్ర ప్రారంభమై ఈ నెల 9వ తేదీన నార్త్‌ కేప్‌లో ముగిసిందని శశికాంత్‌ తెలిపారు. ఆస్ట్రియా, జర్మనీ, స్వీడన్‌, ఫిన్‌లాండ్‌ మీదుగా నార్వేలోని నిర్దేషిత నార్త్‌ కేప్‌కు 18 రోజుల్లోనే ఇద్దరూ చేరుకున్నట్లు వివరించారు. విభిన్న శీతోష్ణ, భౌగోళిక పరిస్థితులను దాటుతూ ముందుకు సాగామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 320 మంది సైక్లిస్టులు పాల్గొనగా భారత్‌ నుంచి ఏడుగురు ప్రాతినిధ్యం వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని