logo

రాష్ట్రాన్ని పట్టపగలే దోచుకుంటున్నారు: షర్మిల

మాయమాటలతో అధికారం చేపట్టిన తెరాస నేతలు పట్టపగలే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా బొంరాస్‌పేట మండలంలోని దుద్యాలలో జరిగిన ‘మాట ముచ్చట’లో ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Updated : 11 Aug 2022 04:05 IST


ప్రజలతో మాట్లాడుతూ...

బొంరాస్‌పేట, న్యూస్‌టుడే: మాయమాటలతో అధికారం చేపట్టిన తెరాస నేతలు పట్టపగలే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా బొంరాస్‌పేట మండలంలోని దుద్యాలలో జరిగిన ‘మాట ముచ్చట’లో ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ తెరాస ఈ ఎనిమిదేళ్లలో సొంతిల్లు, రుణమాఫీ, పంటలకు నష్టపరిహారం, కొత్తగా రేషన్‌కార్డులు, పింఛన్లు, ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నట్లు ఆరోపించారు.

అవగాహన లేని మాటలు వద్దు: తెరాస

కొడంగల్‌, న్యూస్‌టుడే: తెరాస పార్టీపై, ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిపై వైతెపా అద్యక్షురాలు షర్మిల అవగాహన లేని మాటలు మాట్లాడారని తెరాస అధికార ప్రతినిధి మధుసూదన్‌యాదవ్‌ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పార్టీ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


తెరాస శ్రేణుల నిరసన

నాయకుల ఆగ్రహం

బొంరాస్‌పేట: వైతెపా అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలపై తెరాస నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం కొడంగల్‌లో జరిగిన బహిరంగసభలో షర్మిల మాట్లాడుతూ కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. బుధవారం దుద్యాల చేరుకున్న షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న సమయంలో తెరాస మండల నాయకులు పార్టీ జెండాలు, నల్ల జెండాలతో అక్కడికి చేరుకొని ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని లేదంటే పాదయాత్రను అడ్డుకుంటామని ఆందోళన చేయటంతో పోలీసులు వచ్చి సర్దిచెప్పారు. బొంరాస్‌పేట మండలకేంద్రంలో తెరాస నాయకులు విలేకర్లతో మాట్లాడుతూ కొడంగల్‌ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులు యాదగిరి, పీఏసీఎస్‌ అధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు మండలాధ్యక్షులు మహేందర్‌రెడ్డి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని