logo

రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కీలకం

రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తే అది అభివృద్ధిలో కీలకంగా మారుతుందని ప్రొ.హరగోపాల్‌ అన్నారు. ఆచార్య జయశంకర్‌ జయంతిని పురస్కరించుకుని అమీర్‌పేటలోని సెస్‌ ఆడిటోరియంలో ‘కేంద్ర-రాష్ట్రాల సంబంధాలు, భవిష్యత్తు, సమాఖ్యవాదం’

Published : 12 Aug 2022 03:56 IST

ప్రొఫెసర్‌ హరగోపాల్‌

అమీర్‌పేట, న్యూస్‌టుడే: రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తే అది అభివృద్ధిలో కీలకంగా మారుతుందని ప్రొ.హరగోపాల్‌ అన్నారు. ఆచార్య జయశంకర్‌ జయంతిని పురస్కరించుకుని అమీర్‌పేటలోని సెస్‌ ఆడిటోరియంలో ‘కేంద్ర-రాష్ట్రాల సంబంధాలు, భవిష్యత్తు, సమాఖ్యవాదం’ అనే అంశంపై గురువారం జరిగిన సదస్సులో ప్రొ.హరగోపాల్‌ ప్రధాన వక్తగా మాట్లాడారు. దేశంలో రాజకీయ పరిణామాలపై మధ్యతరగతి వర్గం మౌనం మంచిది కాదన్నారు. భవిష్యత్తు తరాలు ప్రభుత్వాలను, నాయకులను నిందిస్తాయని హెచ్చరించారు. ప్రణాళికాసంఘం వంటి సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరగడం అత్యంత బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు ఒకటిగా ఉండేవన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను అధ్యయనం చేయడానికి నియమించిన సర్కారియా కమిషన్‌కు రాజకీయ, ఆర్థిక సమస్యలు ఎదురవడం ఆందోళనకర అంశమని చెప్పారు. గవర్నర్‌ పాత్ర రాజకీయంగా వివాదాస్పమైందన్నారు. సెస్‌ డైరెక్టర్‌ ప్రొ.రేవతి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని