logo
Published : 12 Aug 2022 03:56 IST

ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ సైబర్‌ నేర నియంత్రణపై శిక్షణ


పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న స్వాతి లక్రా. చిత్రంలో డీఐజీ సుమతి, కమిషనర్‌ దేవసేన, ఎస్పీ రఘువీర్‌, సైబర్‌ నిపుణులు

ఈనాడు- హైదరాబాద్‌: సైబర్‌ ముప్పుపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘సైబర్‌ కాంగ్రెస్‌’ పేరిట ఇస్తున్న శిక్షణను త్వరలో ప్రైవేటు విద్యా సంస్థలకూ విస్తరిస్తామని అదనపు డీజీపీ (మహిళా భద్రత) స్వాతిలక్రా వెల్లడించారు.‘సైబర్‌ కాంగ్రెస్‌’ శిక్షణ ముగింపు కార్యక్రమం ‘సైబర్‌థాన్‌’’ పేరిట హైదరాబాద్‌లో గురువారం జరిగింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 1,650 సర్కారుబడుల నుంచి 3,300 మంది విద్యార్థుల్ని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చిన విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇచ్చారు. సైబ్‌-హర్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సైబర్‌ రాయబారులుగా ఎంపికైన విద్యార్థులు నేరాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తేనే ఇది విజయవంతమైనట్లు’ స్వాతిలక్రా చెప్పారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ దేవసేన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోనూ సైబర్‌ నేరాలు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్‌ కాంగ్రెస్‌ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులతో పాఠశాలల్లో సైబర్‌ క్లబ్‌లు ఏర్పాటవుతాయని డీఐజీ సుమతి తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని