logo

చిన్నారిపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి మల్కాజిగిరిలోని పోక్సో న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. ఘట్‌కేసర్‌కు చెందిన భార్యాభర్తలు సమీపంలోని ఓ కళాశాలలో పనిచేస్తూ

Updated : 12 Aug 2022 05:39 IST


జగన్నాథ్‌ బెహరా

ఈనాడు, హైదరాబాద్‌: ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి మల్కాజిగిరిలోని పోక్సో న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. ఘట్‌కేసర్‌కు చెందిన భార్యాభర్తలు సమీపంలోని ఓ కళాశాలలో పనిచేస్తూ అందులోనే ఉండేవారు. వారికి ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది. 2015 ఆగస్టు 25న రాత్రి చిన్నారి నిద్రిస్తుండగా తల్లిదండ్రులు కళాశాల గదులకు తాళం వేసేందుకు వెళ్లారు. అక్కడే ఉంటున్న ఒడిశాకు చెందిన సెంట్రింగ్‌ కార్మికుడు జగన్నాథ్‌ బెహరా(26) బాలికను పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు గమనించగానే.. చిన్నారిని వదిలేసి పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు అప్పటి ఘట్‌కేసర్‌ సీఐ రవీంద్ర నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా న్యాయమూర్తి బి.సురేశ్‌ తీర్పు వెలువరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని