logo

విద్యుత్తు బిల్లుల జారీలో ఆలస్యం

గ్రేటర్‌లోని కొన్ని సెక్షన్లలో విద్యుత్తు మీటర్‌ రీడింగ్‌ గందరగోళంగా మారింది. 12వ తేదీ వచ్చినా పలుచోట్ల ఇప్పటి వరకు బిల్లులు జారీ చేయలేదు. ప్రతినెలా రెండు, మూడో తేదీల్లో జారీ చేసే కాలనీల్లోనూ ఇప్పటి వరకు బిల్లులు

Published : 12 Aug 2022 03:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లోని కొన్ని సెక్షన్లలో విద్యుత్తు మీటర్‌ రీడింగ్‌ గందరగోళంగా మారింది. 12వ తేదీ వచ్చినా పలుచోట్ల ఇప్పటి వరకు బిల్లులు జారీ చేయలేదు. ప్రతినెలా రెండు, మూడో తేదీల్లో జారీ చేసే కాలనీల్లోనూ ఇప్పటి వరకు బిల్లులు అందలేదని వినియోగదారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే ఆర్టిజన్లు గత నెల బదిలీ కావటంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. బదిలీపై వచ్చిన ఆర్టిజన్లు, మీటర్‌ రీడర్లకు కొత్త ప్రాంతాలపై సరైన అవగాహన లేకపోవటంతో బిల్లుల జారీ గందరగోళంగా మారింది.

గాలులతో కటకట.. నగరంలో రెండు రోజులుగా ఈదురుగాలులు వీస్తున్నాయి. చెట్ల కొమ్మలు విద్యుత్తు తీగలకు తగిలి అంతరాయాలు ఏర్పడుతున్నాయి. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగాయి. ప్రగతినగర్‌ ఇన్‌కాయిస్‌ సమీపంలోని కాలనీలో చెట్ల కొమ్మలు తగిలి కరెంట్‌ సరఫరా నిల్చిపోయింది. కొండాపూర్‌లో రెండు గంటలు సరఫరా ఆగింది. మియాపూర్‌లో, కేపీహెచ్‌బీ ఫేజ్‌-2, కొత్తపేట ప్రాంతాల్లోనూ ఇబ్బందులు ఏర్పడ్డాయి. రోజులో నాలుగైదు సార్లు కరెంట్‌ వస్తూ పోతుండటంతో ఇంట్లో ఉపకరణాలు దెబ్బతింటున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని