logo

సీసీఎస్‌లో లొంగిపోయిన సాహితీ ఎండీ

మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను అవకాశంగా చేసుకొని ప్రీలాంచ్‌ పేరుతో మోసాలకు పాల్పడిన సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ గురువారం నగర సీసీఎస్‌ పోలీసుల

Published : 12 Aug 2022 03:56 IST

ప్రీలాంచ్‌ రియల్‌ దందాపై పోలీసుల విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను అవకాశంగా చేసుకొని ప్రీలాంచ్‌ పేరుతో మోసాలకు పాల్పడిన సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ గురువారం నగర సీసీఎస్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ కేంద్రంగా మూడేళ్ల కిందట సాహితీ వెంచర్స్‌, సాహితీ సర్వనీ ఎలైట్‌ పేరుతో పది టవర్ల నిర్మాణం చేపడుతున్నట్లు.. డబుల్‌, త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ గృహాలను తక్కువ ధరకు ఇస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. ప్రీ లాంచింగ్‌ అంటూ వందలాది మంది నుంచి సుమారు రూ.1500-2000 కోట్లు వసూలు చేసినట్టు అంచనా. నెలలు గడుస్తున్నా నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవటంతో డబ్బు చెల్లించిన వారంతా సంఘంగా ఏర్పడ్డారు. జూబ్లీహిల్స్‌, నగర సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం లక్ష్మీనారాయణ సీసీఎస్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు సాయంత్రం వరకూ సాహితీ సంస్థ, ప్రీలాంచింగ్‌, డబ్బు వసూళ్లు తదితర అంశాలపై విచారణ జరిపారు. బాధితులను పిలిపించి సమాచారం సేకరించారు. శుక్రవారం మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా లక్ష్మీనారాయణకు స్పష్టం చేశారు. బాధితులు, నిందితులను పూర్తిస్థాయిలో విచారిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని