logo

రాఖీ కట్టేందుకు.. నగరం బయలుదేరింది

ఒక్కసారిగా బస్సు ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. బస్సులు రద్దీగా మారాయి. ఈ రద్దీకి కారణం రాఖీ పౌర్ణమి. సోదరులకు రాఖీ కట్టేందుకు అక్కాచెల్లెళ్లు ఊళ్లకు బయలుదేరారు. వారాంతం తోడవడంతో నగర వాసులు స్వగ్రామాలకు

Updated : 12 Aug 2022 06:55 IST

కిటకిటలాడుతున్న ప్రయాణ ప్రాంగణాలు


ఎంజీబీఎస్‌లో

ఈనాడు, హైదరాబాద్‌: ఒక్కసారిగా బస్సు ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. బస్సులు రద్దీగా మారాయి. ఈ రద్దీకి కారణం రాఖీ పౌర్ణమి. సోదరులకు రాఖీ కట్టేందుకు అక్కాచెల్లెళ్లు ఊళ్లకు బయలుదేరారు. వారాంతం తోడవడంతో నగర వాసులు స్వగ్రామాలకు ప్రయాణమయ్యారు. ఈ నెల 17న పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు ఉండడంతో  సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌తో పాటు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఎల్‌బీనగర్‌, కూకట్‌పల్లి బస్సుస్టేషన్లలో రద్దీ ఎక్కువైంది.

వరుస సెలవులతో.. శ్రీశైలం, జూరాల, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో జలకళ ఉట్టిపడుతోంది. గేట్లు ఎత్తటంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. శుక్రవారం పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. రెండో శనివారం, ఆదివారం, సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం.. ఇలా వరస సెలవులు రావడంతో విహార యాత్రలు సైతం పెరిగాయి. కొందరు లాంగ్‌ డ్రైవ్‌లకు వెళ్తున్నారు. నగరానికి చేరువలో ఉన్న జలపాతాలు, సందర్శనా స్థలాలకు పయనమయ్యారు.


నేడు సమైక్య రక్షాబంధన్‌

వజ్రోత్సవాలను 15 రోజులపాటు నిర్వహించడంలో భాగంగా శుక్రవారం బల్దియా కార్యాలయాల్లో సమైక్య రక్షాబంధన్‌ జరపనున్నట్లు అధికారులు తెలిపారు. రోజంతా దేశ భక్తి చిత్రాలు, పాటలు ప్రసారం చేయాలని ప్రసార మాధ్యమాలను జీహెచ్‌ఎంసీ కోరింది. ఇంటింటికి జెండాల పంపిణీ కొనసాగుతోందని, అందుకున్న కుటుంబాలు ఈ నెల 22 వరకు జెండాలు ఎగరేయాలని కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ సూచించారు.

ముషీరాబాద్‌ ప్రభుత్వ పాఠశాలలో హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయకు రాఖీ కడుతున్న విద్యార్థిని

సికింద్రాబాద్‌లో బైక్‌ ర్యాలీ ముగింపు సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాఖీ కడుతున్న కార్పొరేటర్‌ దీపిక

గోల్కొండ తారామతి-బారాదరిలో మహవీర్‌, తీగల కృష్ణారెడ్డి కళాశాలలకు చెందిన  విద్యార్థినులు జవాన్లకు రాఖీలు కట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు