logo

అఖిల భారత ఉద్యాన ప్రదర్శన 18 నుంచి

అఖిల భారత ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన ‘గ్రాండ్‌ నర్సరీ మేళా’ను ఈనెల 18 నుంచి 5 రోజుల పాటు నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని

Published : 12 Aug 2022 04:46 IST

అంబర్‌పేట, న్యూస్‌టుడే: అఖిల భారత ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన ‘గ్రాండ్‌ నర్సరీ మేళా’ను ఈనెల 18 నుంచి 5 రోజుల పాటు నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 120కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేస్తారని తెలిపారు. ప్రదర్శన ఇన్‌ఛార్జ్‌ ఖలీద్‌ అహమ్మద్‌ ఆధ్వర్యంలో గురువారం బంజారా హిల్స్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మంత్రి హరీశ్‌రావు మేళా బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇళ్లు, కార్యాలయాలు, ఆరుబయట పెంచుకునే మొక్కలు, పండ్లు, కూరగాయల తోటలు, ఆర్గానిక్‌ ఉత్పత్తులు, ఉద్యాన, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఈనెల 18 నుంచి 22 వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండే ప్రదర్శనను మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఉద్యానవన కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి ప్రారంభిస్తారని మేళా ఇన్‌ఛార్జ్‌ ఖలీద్‌ అహమ్మద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని