logo
Published : 12 Aug 2022 05:02 IST

తాడాట మంచి వ్యాయామం

‘ఈనాడు’తో ప్రముఖ స్పోర్ట్స్‌ అండ్‌ ఎక్సర్‌సైజ్‌ మెడిసిన్‌ డాక్టర్‌ రజత్‌ చౌహన్‌

ఈనాడు, హైదరాబాద్‌: చిన్నతనంలో సరదా కోసం తాడాటా(స్కిప్పింగ్‌) ఆడినా.. పెద్దయ్యాక ఆరోగ్యానికి, పరుగును సులభతరం చేయడంలో అది ఎంతో మేలు చేస్తుందని..  దేశంలోని క్లిష్టమైన రన్నింగ్‌ రేసులకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్‌ రజత్‌ చౌహన్‌ అన్నారు. ఈ నెల 28న హైదరాబాద్‌ మారథాన్‌ నేపథ్యంలో 5కె, 10కెతో సహా పరుగు పోటీల్లో పాల్గొనేవారికి శిక్షణ ఇచ్చేందుకు నగరానికొచ్చారు.  ‘ఈనాడు’తో మాట్లాడుతూ క్రీడలు, పరుగు ప్రాధాన్యం, పరుగుతో తన అనుభవం, కొత్తగా మొదలెట్టేవారికి సూచనలు చేశారు.  

డాక్టర్‌గా మారారు...  

మా పెద్దలు నన్ను డాక్టర్‌ చదవాలన్నారు. నాకేమో పరుగును కెరీర్‌గా మల్చుకోవాలనుకున్నా.  ఇంట్లో అమ్మానాన్న నిద్రలేవక ముందే లేచి రెండు గంటలు పరుగెత్తేవాడిని.  ఉమ్మడి కుటుంబం.. పెద్దల సూచనతో ఎంబీబీఎస్‌లో చేరా. అనాసక్తితోనే చదువు కొనసాగించినా. మూడో ఏడాదిలో ఉన్నప్పుడు నాన్న అనారోగ్యం బారిన పడటం.. మందుల కంటే ఆయన జీవనశైలి ఉదయం నడక, వ్యాయామం వంటివి త్వరగా కోలుకునేలా చేశాయి. ఈ లోపు ఎంబీబీఎస్‌ పూర్తయ్యింది. ఆ తర్వాత స్పోర్ట్స్‌ అండ్‌ ఎక్సర్‌సైజ్‌ మెడిసిన్‌ చేశా. ఇందులో తాను బంగారు పతకాలు సాధించడం కంటే ఎంతోమంది పతకాలు సాధించడంలో నా తోడ్పాటు అవసరం ఉందని గ్రహించా.

ఫిట్‌నెస్‌ ప్రాధాన్యం..

ఇప్పటి పిల్లలు, యువతరాన్ని గమనిస్తే వారి అమ్మానాన్నలు పెరిగినప్పటి పరిస్థితుల కంటే తక్కువ ఫిట్‌నెస్‌తో కనబడుతున్నారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. తాడాటతో మొదలెట్టవచ్చు. దీనికి పెద్ద ఖర్చు కూడా కాదు. .మొదట్లో  ఒకటి రెండు నిమిషాలతో మొదలెట్టి.. 15 నిమిషాల వరకు రోజూ చేస్తే క్యాలరీలు కరిగించడంతో పాటూ పరుగెత్తడం కూడా సులువు అవుతుంది. పరుగెత్తలేము అనుకునేవారు కూడా తాడాటాతో వ్యాయామం చేయవచ్చు. వయస్సుతో సంబంధం లేదు.

* ఇప్పటివరకు పురుగెత్తని వారు 5కెతో ఆరంభించండి.  మూడు వారాల సమయం ఉంది కాబట్టి శిక్షణకు సమయం సరిపోతుంది. ఇదివరకే పరుగెత్తే అలవాటు ఉన్నవారు 10కె, హాఫ్‌, పుల్‌మారథాన్‌లో పాల్గొనొచ్చు.  

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని