logo

గొంతులన్నీ ఏకం.. వజ్రోత్సవంలో మమేకం

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం నగరవ్యాప్తంగా ‘పరుగు’ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రెవెన్యూ, పోలీసు, జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Published : 12 Aug 2022 05:02 IST

నగరవ్యాప్తంగా వేలాది మందితో స్వతంత్ర పరుగు, నడక

మాదాపూర్‌ హైటెక్స్‌ కమాన్‌ వద్ద నిర్వహించిన 4కె రన్‌లో పాల్గొన్న అనంతరం జాతీయ జెండాలతో ఐటీ ఉద్యోగులు, పోలీసులు, బల్దియా సిబ్బంది నినాదాలు

ఈనాడు, హైదరాబాద్‌: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం నగరవ్యాప్తంగా ‘పరుగు’ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రెవెన్యూ, పోలీసు, జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు సైతం ర్యాలీ నిర్వహించాయి. భాజపా నిర్వహించిన బైక్‌ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొనగా.. పరుగులో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితారెడ్డి పాల్గొన్నారు. దేశ భక్తి పాటలు, బృంద నృత్యాలతో త్రివర్ణ పతాక రెపరెపల మధ్య వేలాది మంది యువత వజ్రోత్సవాల్లో మమేకమైంది.

ఎల్బీనగర్‌ కూడలిలో భారీ మువ్వన్నెల జెండాతో విద్యార్థుల ర్యాలీ


సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో చిన్నారుల నృత్య ప్రదర్శన


హైటెక్స్‌ వద్ద 4కె రన్‌ను డీసీపీ శిల్పవల్లితో కలిసి ప్రారంభించి మాట్లాడుతున్న నటుడు నిఖిల్‌


కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్ద ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన అశ్వాలు


శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద బైక్‌ ర్యాలీలో పాల్గొన్న ఎయిర్‌పోర్టు భద్రతాధికారులు, సాయుధ బలగాలు. విమాన ప్రయాణికులకు జాతీయ జెండాలను అందజేశారు.    


ఎల్బీనగర్‌లో ర్యాలీలో జెండా చేతబూనిన మంత్రి సబిత


కమాండ్‌ కంట్రోల్‌ వద్ద రన్‌లో పాల్గొన్న పోలీసు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని