logo

మాదకద్రవ్యాలు విక్రయిస్తోన్న నైజీరియన్‌ అరెస్టు

మాదకద్రవ్యాలు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నైజీరియన్‌ను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 30గ్రాముల ఎండీఎంఏ, 4 సెల్‌ఫోన్లు

Published : 12 Aug 2022 19:18 IST

హైదరాబాద్: మాదకద్రవ్యాలు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నైజీరియన్‌ను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 30గ్రాముల ఎండీఎంఏ, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ రాజేశ్‌చంద్ర తెలిపారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘నైజీరియాకు చెందిన ఒసాగ్వే జేమ్స్ 2013 నుంచి భారత్‌కు పర్యాటక వీసాపై వచ్చిపోతున్నాడు. 2021లో వీసాపై వచ్చిన జేమ్స్‌, గడువు తీరినా గోవాలో అక్రమంగా ఉంటున్నాడు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో పలువురికి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి రహస్యంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది మార్చిలో మాదకద్రవ్యాలు విక్రయిస్తుండగా జేమ్స్‌ను గోవా పోలీసులు అరెస్టు చేశారు. మూడు నెలలపాటు జైల్లో ఉండి బెయిల్‌పై బయటికి వచ్చాడు. గతంలోనూ ఒకసారి అరెస్టు అయిన జేమ్స్‌.. నకిలీ ధ్రువపత్రాలతో మరో పాస్‌పోర్టు సృష్టించి భారత్‌కు వచ్చాడు’’ అని డీసీపీ మీడియాకు వెల్లడించారు. జేమ్స్ సెల్‌ఫోన్‌లోని వాట్సాప్ గ్రూపులో 108 మంది ఉన్నట్లు గుర్తించామని.. మాదకద్రవ్యాలు వినియోగించే వారిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీపీ రాజేశ్‌ చంద్ర తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని