logo

మువ్వన్నెల దీపాలతో.. ముస్తాబు చేయండి

గ్రేటర్‌లో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు స్ఫూర్తి చాటుతున్నాయి. రోజుకో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో.. జీహెచ్‌ఎంసీ శుక్రవారం సమైక్య రాఖీ పండగను కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించింది. సోమవారం

Updated : 13 Aug 2022 02:10 IST

ఇళ్లు, కార్యాలయాల అలంకరణకు జీహెచ్‌ఎంసీ పిలువు

ఓ వస్త్రదుకాణంలో ఆకట్టుకునేలా అలంకరణ

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు స్ఫూర్తి చాటుతున్నాయి. రోజుకో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో.. జీహెచ్‌ఎంసీ శుక్రవారం సమైక్య రాఖీ పండగను కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించింది. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుంటాయి. మంగళవారం సామూహిక జాతీయ గీతాలాపనపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టిసారించింది. లక్షల మందిని కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు ముమ్మర ప్రచారం చేపడుతోంది. వజ్రోత్సవాల వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం టెలికాన్ఫరెన్సు ద్వారా జీహెచ్‌ఎంసీకి పలు సూచనలు చేశారు. నివాస, వాణిజ్య భవనాలన్నింటిపైనా త్రివర్ణ పతాకం రెపరెపలు కనిపించేలా విద్యుద్దీపాలంకరణ చేసుకోవాలని యజమానులకు సూచించామన్నారు. కాలనీల్లో పర్యటించి.. పౌరులకు, అపార్ట్‌మెంట్ల సంఘాలకు విద్యుద్దీపాలంకరణపై చైతన్యం కల్పించాలని సోమేష్‌కుమార్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ను ఆదేశించారు.

ఎక్కడికక్కడ జాతీయ గీతాలాపన..

ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు నగరవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరగనుంది. ఇళ్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసేవారంతా నిర్దేశిత సమయానికి జాతీయ గీతాన్ని ఆలపించాలని డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

15న పార్కుల్లో ఉచిత ప్రవేశం

వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 15న నగరంలోని పలు పార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్టీఆర్‌ పార్కు, లుంబిని పార్కు, సంజీవయ్య పార్కు, లేక్‌వ్యూ పార్కులతో పాటు మెల్కోటి, ప్రియదర్శిని, రాజీవ్‌గాంధీ, పటేల్‌కుంట, లంగర్‌హౌస్‌, చింతల్‌కుంట పార్కుల్లోకి ప్రవేశం ఉంటుందని తెలిపింది.

త్రివర్ణ వెలుగుల్లో ఫలక్‌నుమా ప్యాలెస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని