logo
Published : 13 Aug 2022 02:04 IST

నేడు గ్రాండ్‌ బస్‌ పరేడ్‌

ఉప్పల్‌ ఆర్టీసీ వర్క్‌ షాప్‌లో మెరుగులు అద్దుకుంటున్న బస్సు

ఈనాడు, హైదరాబాద్‌: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రజారవాణాలో వచ్చిన వినూత్న మార్పులను కళ్లకు కట్టేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. నగరంలో తిరిగిన మొదటి బస్‌ను రోడ్డెక్కించే ప్రయత్నం చేస్తోంది. ‘గ్రాండ్‌ బస్‌ పరేడ్‌’ పేరిట శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ట్యాంక్‌బండ్‌పై కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో 7వ నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రయాణించిన ‘అల్బేనియం’ బస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తన తల్లి కోరిక మేరకు ప్రజారవాణాను అందుబాటులోకి తీసుకువచ్చారు. ‘నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్‌’ పేరిట 1932లో సమకూర్చుకున్న ‘అల్బేనియం’ బస్‌ను పరేడ్‌కు తీసుకువస్తారు. నిజాం తల్లి జహర మహమ్మదియన్‌ లక్ష వెండి నాణేలను సేకరించి ఇవ్వగా.. వాటిని విక్రయించి 27 అల్బేనియం బస్సులను బ్రిటన్‌ నుంచి ఓడల ద్వారా నిజాం తెప్పించారు. తొలి బస్‌ సర్వీస్‌ను కాచిగూడ నుంచి ప్రారంభించారు. ఆ బస్‌ను ఆర్టీసీ బస్‌ భవన్‌ ముందు ప్రదర్శనగా ఉంచారు. దీనిని ఉప్పల్‌ వర్కుషాపునకు తీసుకెళ్లి మెరుగులద్దారు. డీజిల్‌తో నడిచే ఈ వాహనాన్ని మళ్లీ రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకున్నారు. శనివారం ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 1932లో నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ నడిపిన బస్‌ నుంచి నేడు టీఎస్‌ఆర్టీసీ నడుపుతున్న గరుడ, ఒలెక్ట్రా ఏసీ బస్సులను పరేడ్‌లో ఉంచనున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని