logo
Published : 13 Aug 2022 02:04 IST

సిసలైన ఉద్యమకారిణి..విద్యాప్రదాత

దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆసుపత్రి

మహాత్మాగాంధీ స్ఫూర్తితో స్వాతంత్య్ర సంగ్రామంలోకి వచ్చిన దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌.. దేశానికి విముక్తి లభించే వరకూ సిసలైన ఉద్యమకారిణిలా పోరాడారు. 1909లో రాజమండ్రిలో జన్మించిన ఆమె గాంధీజీ ప్రసంగానికి ఉత్తేజితురాలయ్యారు. 1938లో ఆంధ్ర మహిళాసభను స్థాపించారు. 1956లో తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవతరించాక ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఆంధ్ర మహిళా సభ తరఫున కళాశాల ప్రారంభించారు. విద్యానగర్‌లో దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ జనరల్‌ ఆసుపత్రిని నిర్మించారు. అక్కడ జన్మించిన వారు శిశువిహార్‌లో పెరిగి ప్రాథమిక పాఠశాలలో చదివి, కళాశాలల్లో ఉన్నత విద్యను పూర్తిచేసుకుని బీఈడీ లేదా నర్సింగ్‌ విద్యను అభ్యసించి అక్కడే ఉద్యోగాలు పొందాలన్నది ఆమె లక్ష్యం. ఆమె స్థాపించిన ఆంధ్రమహిళా సభ తొమ్మిదేళ్ల క్రితం వజ్రోత్సవ సంబరాలను జరుపుకొంది. గాంధీ చెప్పిన ఒకేఒకమాటతో జీవితాంతం ఖద్దరు ధరించారు. - ఈనాడు, హైదరాబాద్‌

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని