logo

కబ్జాలవుతున్నా కదలికేది?

ఏళ్ల పాటు ఉద్యోగం చేసి హైదరాబాద్‌కు శివారులో స్థలాలు కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్లయ్యాయి. ఆ తర్వాత ఇదంతా ప్రభుత్వ భూమి అంటూ చెప్పేయడంతో కొనుగోలు చేసిన వారంతా తీవ్ర షాక్‌కు గురయ్యారు. న్యాయస్థానాన్ని

Published : 13 Aug 2022 02:04 IST

విద్యుత్తు ఉద్యోగుల సహకార హౌసింగ్‌ సొసైటీ

విక్రయించిన ఇళ్ల స్థలాల్లో చదును పనులు

ఈనాడు, సంగారెడ్డి: ఏళ్ల పాటు ఉద్యోగం చేసి హైదరాబాద్‌కు శివారులో స్థలాలు కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్లయ్యాయి. ఆ తర్వాత ఇదంతా ప్రభుత్వ భూమి అంటూ చెప్పేయడంతో కొనుగోలు చేసిన వారంతా తీవ్ర షాక్‌కు గురయ్యారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇంతలోనే కొందరు యథేచ్ఛగా కబ్జాలకు దిగారు.

నాలుగు దశాబ్దాల క్రితం లేఔట్‌.. : విద్యుత్తు ఉద్యోగుల సహకార హౌసింగ్‌ సొసైటీ 1982లో ఏర్పడింది. అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌లోని రెండు సర్వే సంఖ్యల్లో కలిపి 131 ఎకరాల విస్తీర్ణంలో లేఔట్‌ను అభివృద్ధి చేశారు. 725 కుటుంబాలకు చెందిన ఉద్యోగులు ఇక్కడ స్థలాలు కొనుగోలు చేశారు. వీరు రిజిస్ట్రేషన్‌ చేసుకొని కొన్నవి పట్టా భూములు కావని, అవన్నీ ప్రభుత్వ భూములేనంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తుది తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని వారు భావిస్తున్న తరుణంలో కొందరు ఈ స్థలాలను కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే కొందరు ట్రాక్టర్లలో రాళ్లు, మట్టి తెచ్చి చదును చేస్తున్నారని, తాము గతంలో పాతిన హద్దురాళ్లనూ తొలగిస్తున్నారని.. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని మిగతా సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం..

విద్యుత్తు ఉద్యోగుల సహకార హౌజింగ్‌ సొసైటీ కోసం అభివృద్ధి చేసిన లేఅవుట్‌ స్థలం ప్రభుత్వ భూమి అంటూ న్యాయస్థానంలో కేసు వేశాం. ప్రస్తుతం విచారణ దశలో ఉంది. తుదితీర్పు వచ్చేవరకు యథాతథస్థితి కొనసాగించాలని గతంలో న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇందులో కొంత మేర ఆక్రమణలు జరుగుతున్నాయి. అది మా దృష్టికీ వచ్చింది. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్నంతా నివేదికల రూపంలో ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం. తుదితీర్పు మేరకు చర్యలు తీసుకుంటాం. - విజయ్‌, తహసీల్దారు, అమీన్‌పూర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు