logo

సుపారీ ఇచ్చి.. భర్త హత్యకు ప్రయత్నించి

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తపై హత్యాయత్నం చేసిన ఘటనలో మహిళ సహా తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ రెమారాజేశ్వరి విలేకరులకు వివరాలు

Published : 13 Aug 2022 02:04 IST

తుపాకీతో కాల్చిన ఘటనలో తొమ్మిది మంది అరెస్టు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తపై హత్యాయత్నం చేసిన ఘటనలో మహిళ సహా తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ రెమారాజేశ్వరి విలేకరులకు వివరాలు వెల్లడించారు. మర్రిగూడ మండలం తుమ్మడపల్లికి చెందిన చింతపల్లి బాలకృష్ణ వనస్థలిపురంలో ఉంటున్నారు. ప్రస్తుతం నార్కట్‌పల్లి మండలం బివెల్లంలలోని జడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీ కార్మికురాలిగా పనిచేస్తున్న నిమ్మల సంధ్యతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరి సంబంధానికి అడ్డొస్తున్నాడని ఆమె భర్త నిమ్మల స్వామిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. దీనికోసం యాచారం మండలం మాల్‌ ప్రాంతానికి చెందిన కనక రామస్వామితో రూ. 3 లక్షలు సుపారీ కుదుర్చుకున్నారు. రామస్వామి మునుగోడులో స్వామి దుకాణం పక్కనే మరో దుకాణం అద్దెకు తీసుకుని అందులో పనిచేస్తున్న మోహినుద్దిన్‌తో పరిచయం పెంచుకున్నారు. దీంతో పాటు చింతపల్లి మండలం ఇంజమూరుకు చెందిన పోల్‌గిరిబాబు, వెంకటేశ్‌లతో కలిసి హత్యచేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. బాలకృష్ణ అంతటితో ఆగకుండా మరోసారి హైదరాబాద్‌లో తన ఇంట్లో ప్లంబర్‌గా పనిచేస్తున్న యూసుఫ్‌తో పథకం వేసి రూ.12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ సమాభావన సంఘం ద్వారా అప్పు తీసుకుని రూ.లక్ష తెచ్చి ఇచ్చింది. యూసుఫ్‌ తన స్నేహితుడు జాహంగీర్‌ పాష, ఆసిఫ్‌ ఖాన్‌లు కలిసి అప్పటికే బిహార్‌లో ఫిస్టల్‌ కొనుగోలు చేసుకుని ఉన్న అబ్ధుల్‌ రహమాన్‌తో ఈనెల 4న స్వామిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. వీరిలో చింతపల్లి బాలకృష్ణ, నిమ్మల సంధ్య, అబ్ధుల్‌ రహమాన్‌, మహ్మద్‌ జహంగీర్‌, కనక రామస్వామి, అసిఫ్‌ఖాన్‌, గిరిబాబు, వెంకటేశ్‌, మోహినుద్దిన్‌లను అరెస్టు చేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని