logo

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు : సబితారెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 16న నూతనంగా నిర్మించిన జిల్లా పాలనాధికారి భవన సముదాయం, జిల్లా తెరాస పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి తెలిపారు.

Published : 13 Aug 2022 02:02 IST

సభా స్థలిని పరిశీలిస్తున్న మంత్రి సబితారెడ్ఢి చిత్రంలో

ఎమ్మెల్యేలు యాదయ్య, ఆనంద్‌, అధికారులు

వికారాబాద్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 16న నూతనంగా నిర్మించిన జిల్లా పాలనాధికారి భవన సముదాయం, జిల్లా తెరాస పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి తెలిపారు. శుక్రవారం వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌, చేవెళ్ల ఎమ్మెల్యేలు ఆనంద్‌, మహేష్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, యాదయ్య, జిల్లా కలెక్టర్‌ నిఖిలతో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసు కార్యాలయ ఆవరణలో హెలిప్యాడ్‌, కలెక్టర్‌ కార్యాలయ పరిసరాల పరిశుభ్రత, సుందరీకరణ పనులను పరిశీలించారు. రహదారులకు ఇరువైపులా ఆకర్షణీయంగా నాటిన మొక్కలను చూశారు. సభా ప్రాంగణంలో చేపట్టిన పనులతో పాటు ప్రముఖలు, ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం ఏర్పాటు చేసిన వేర్వేరు ప్రవేశ ద్వారాల వివరాలను తెలుసుకున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలు నిలపడానికి అనువైన స్థలాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌, రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది

తాండూరు: వ్యవసాయ విపణి విస్తరణ, ఆటో నగర్‌ ఏర్పాటు, నాపరాళ్ల పాలిష్‌ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం భూములను కేటాయించడంతో తాండూరు ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఈమేరకు ఆమె గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని అభినందిస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని