logo

మన్నెగూడ కూడలి పచ్చదనంగా మారాలి: డీఆర్‌డీఓ

అనువైన మొక్కలు నాటించి మన్నెగూడ కూడలిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని డీఆర్‌డీఓ కృష్ణన్‌ పేర్కొన్నారు. మండల పరిధిలోని ఎన్కెపల్లి, మన్నెగూడ గ్రామాల పరిధిలో చేపట్టిన హరితహారాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. రహదారికి ఇరువైపులా

Published : 13 Aug 2022 02:02 IST

పనులు పరిశీలిస్తున్న కృష్ణన్‌

పూడూరు: అనువైన మొక్కలు నాటించి మన్నెగూడ కూడలిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని డీఆర్‌డీఓ కృష్ణన్‌ పేర్కొన్నారు. మండల పరిధిలోని ఎన్కెపల్లి, మన్నెగూడ గ్రామాల పరిధిలో చేపట్టిన హరితహారాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. రహదారికి ఇరువైపులా ఇటీవల నాటించిన మొక్కలను పరిశీలించారు. నాటిన ప్రతి మొక్క బతికించే విధంగా చూడాలని ఆదేశించారు. ఇంకా మొక్కలు అవసరమైతే ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా తెప్పించే విధంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, ఎంపీఓ సుందర్‌, మన్నెగూడ సర్పంచి అబ్దుల్‌ హసీబ్‌, పంచాయతీ కార్యదర్శి మాణిక్యం, ఏపీఓ రాములు ఉన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని