logo

డొల్ల సంస్థ పేరిట బ్యాంకుకు టోకరా!

డొల్ల కంపెనీ ముసుగులో బ్యాంకుకు టోకరా వేశారు. వాయిదాలు సక్రమంగా చెల్లించకపోవటంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు ఆరా తీస్తే అసలు విషయం వెలుగుచూసింది. వివరాల్లోకి

Published : 13 Aug 2022 02:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: డొల్ల కంపెనీ ముసుగులో బ్యాంకుకు టోకరా వేశారు. వాయిదాలు సక్రమంగా చెల్లించకపోవటంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు ఆరా తీస్తే అసలు విషయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే ఇద్దరు వ్యక్తులు సంస్థను ప్రారంభించారు. డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. పంజాగుట్టలోని కార్యాలయం నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌ పనులు చేస్తున్నట్టు పత్రాలు సృష్టించి బాలానగర్‌లోని ప్రయివేటు బ్యాంకు నుంచి రూ.1.41కోట్లు రుణం పొందారు. కొన్నినెలలుగా డైరెక్టర్లు బ్యాంకు వాయిదాలు సరిగా చెల్లించకుండా దాటవేస్తూ వస్తున్నారు. దీనిపై అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు దరఖాస్తులో పేర్కొన్న పంజాగుట్ట చిరునామాకు వెళ్లారు. అక్కడ ఒక మహిళ నుంచి వివరాలు సేకరించారు. ఆమె చెప్పిన సమాధానం విన్న బ్యాంకు అధికారులు ఉలికిపాటుకు గురయ్యారు. తన పేరుతో తీసుకున్న రుణం, వ్యాపార లావాదేవీల గురించి తనకు తెలియదంటూ చెప్పడంతో రుణం తీసుకున్న వ్యక్తి కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో నగర సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని