logo

వంట గది ఎలా ఉంది.. భోజనం రుచిస్తోందా?

నగరంలోని వసతి గృహాల్లో అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తోంది. ప్రత్యేకించి వంట గదులు అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని వసతి గృహాల్లో పారిశుద్ధ్యం వెంటనే మెరుగుపడాలని బల్దియా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు సంబంధిత అధికారులను

Published : 13 Aug 2022 02:02 IST

వసతి గృహాల్లో అధికారులు తనిఖీలు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలోని వసతి గృహాల్లో అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తోంది. ప్రత్యేకించి వంట గదులు అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని వసతి గృహాల్లో పారిశుద్ధ్యం వెంటనే మెరుగుపడాలని బల్దియా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు సంబంధిత అధికారులను హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలే గాక.. బీసీ, ఎస్సీ, మైనారిటీ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేయాలని నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీలోనూ ఒక్కో ఫుడ్‌ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌కు లక్ష్యాలు నిర్దేశించింది. రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి, సూచించిన వసతి గృహం మొత్తాన్ని పరిశీలించాలని, సవివర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ మేరకు వసతి గృహాల్లో జీహెచ్‌ఎంసీ ఆహార కల్తీ నియంత్రణాధికారులు చర్యలు ప్రారంభించారు.వారం రోజుల కిందట తనిఖీలు మొదలవగా, ఇప్పటి వరకు 500 కేంద్రాలు పూర్తయినట్లు జీహెచ్‌ఎంసీ చెబుతోంది. మైనారిటీ సంస్థల్లోని వసతి గృహాల్లో పరిశుభ్రతతోపాటు వంటకాల్లో నాణ్యత మెరుగ్గా ఉందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కొన్ని బీసీ, ఎస్సీ హాస్టళ్లలో మాత్రం దుర్భర పరిస్థితులు కనిపించాయని, సంబంధిత అధికారులకు పరిస్థితిని చక్కదిద్దుకోవాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని