logo

అంతర్జాతీయ క్రీడాకారిణికి ఇన్‌స్టా వేధింపులు.. నిందితుడి అరెస్టు

హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణిని సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు గురిచేసిన నిందితుడిని సైబర్‌ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌ పోలీసుల కథనం ప్రకారం..సిద్దిపేట జిల్లాకు చెందిన శ్రీకాంత్‌(26)హైదరాబాద్‌కు

Published : 13 Aug 2022 02:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణిని సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు గురిచేసిన నిందితుడిని సైబర్‌ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌ పోలీసుల కథనం ప్రకారం..సిద్దిపేట జిల్లాకు చెందిన శ్రీకాంత్‌(26)హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణిని సామాజిక మాధ్యమాల్లో వేధిస్తున్నాడు. నకిలీ ఖాతాలను సృష్టించి అసభ్యకర పదజాలంతో దూషిస్తూ పోస్టులు పెడుతున్నాడు. దేశ, విదేశాల్లో ఉండే అభిమానుల కోసం క్రీడాకారిణి సామాజిక మాధ్యమ ఖాతాలను ఆమె తండ్రి నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఇన్‌స్టా ఖాతాలోకి స్నేహితుడిగా చేరిన సదరు యువకుడు క్రీడాకారిణి పట్ల అసభ్యంగా పోస్టులు పెట్టడం ప్రారంభించాడు. అతడి వ్యవహారం మితిమీరడంతో బాధితురాలి తండ్రి గత నెల సిద్దిపేట రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని పిలిపించి రెండుసార్లు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పురాకపోగా మరింతగా చెలరేగాడు. ట్విటర్, ఇన్‌స్టాలోని క్రీడాకారిణి బంధువులు, స్నేహితులకు ఆమె గురించి అసభ్యకరమైన సందేశాలు పంపటం ప్రారంభించాడు. దీంతో బాధితురాలి తండ్రి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు