logo

నిఖిల్‌కు ఆర్థిక సాయం

రెజ్లింగ్‌లో సత్తాచాటుతున్న తెలంగాణ యువ ఆటగాడు నిఖిల్‌ యాదవ్‌కు దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (డీపీఎస్‌) అండగా నిలిచింది. ఇటీవల ప్రపంచ క్యాడెట్‌ (అండర్‌-17) ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం

Published : 13 Aug 2022 02:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: రెజ్లింగ్‌లో సత్తాచాటుతున్న తెలంగాణ యువ ఆటగాడు నిఖిల్‌ యాదవ్‌కు దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (డీపీఎస్‌) అండగా నిలిచింది. ఇటీవల ప్రపంచ క్యాడెట్‌ (అండర్‌-17) ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన అతనికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించింది. శుక్రవారం నాచారంలోని డీపీఎస్‌ ప్రధాన కార్యాలయంలో డీపీఎస్‌ ఛైర్మన్‌ మల్కా కొమురయ్య, మల్కా యశస్వి, శాట్స్‌ ఛైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా అతను ఈ చెక్కు అందుకున్నాడు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నిఖిల్‌ అంతర్జాతీయ వేదికపై రాణించడం ఆనందంగా ఉందని కొమురయ్య అన్నారు. భవిష్యత్‌లోనూ అతణ్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిఖిల్‌ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్ర షాట్‌గన్‌ స్కీట్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన హసన్‌ బిన్‌ టారిఫ్‌ను శాట్స్‌ ఛైర్మన్‌ తన కార్యాలయంలో అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు