Chandrababu: హర్‌ ఘర్‌ తిరంగా.. ఓ పవిత్రమైన కార్యక్రమం: చంద్రబాబు

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగస్వామ్యులు కావడం పూర్వజన్మసుకృతమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Published : 13 Aug 2022 11:42 IST

హైదరాబాద్: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగస్వామ్యులు కావడం పూర్వజన్మసుకృతమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నగరంలోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడిచిన నేపథ్యంలో స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్‌ ఘర్‌ తిరంగా.. ఓ పవిత్రమైన కార్యక్రమం. స్వాతంత్ర్యం కోసం ఎందరో నేతలు త్యాగాలు చేశారు. గాంధీజీ, నేతాజీ, పటేల్‌కు ఘనంగా నివాళి అర్పించాలి. మన ఉద్యమవీరులు బ్రిటిషర్ల గుండెల్లో నిద్రపోయారు. హర్‌ ఘర్‌ తిరంగా.. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం పుట్టుకురావాలి’’ అని చంద్రబాబు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని