Telangana News: బతుకమ్మ కానుకగా కేసీఆర్‌ న్యూట్రిషియన్‌ కిట్‌: మంత్రి హరీశ్‌రావు

బతుకమ్మ కానుకగా వచ్చే నెల నుంచి గర్భిణులకు కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు

Published : 14 Aug 2022 02:34 IST

హైదరాబాద్‌: బతుకమ్మ కానుకగా వచ్చే నెల నుంచి గర్భిణులకు కేసీఆర్‌ న్యూట్రిషియన్‌ కిట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13.30లక్షల మందికి కేసీఆర్‌ కిట్లు అందించినట్టు వెల్లడించారు. కోఠిలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయ ప్రాంగణంలో ప్రోగ్రాం మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 5 క్యాత్‌ ల్యాబ్స్‌, 5 ఎమ్‌ఆర్‌ఐ, 30 సీటీస్కాన్‌లతో పాటు 1,020 అధునాతన పరికరాలు ఉన్నాయని వెల్లడించారు. ఆసుపత్రుల్లో రోగులకు ఇచ్చేందుకు ఔషధాల బడ్జెట్‌ కూడా పెంచుతున్నామని స్పష్టం చేశారు. ఔషధాల పోర్టల్‌ను ఉపయోగించి 3నెలలకు అవసరమైన మందుల స్టాక్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించినట్టు చెప్పారు. అన్ని ప్రభుత్వ వైద్యశాలల సూపరింటెండెంట్ల వద్ద రూ.100 కోట్ల నిధులు పెడుతున్నామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో యంత్రాలు పాడైతే వెంటనే మరమ్మతులు చేసేందుకు వీలుగా.. ఈ-ఉపరకణ్ అనే వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని