logo

దారులు త్రివర్ణాలై..ఉత్సహం తరంగాలై

స్వతంత్ర భారత వజ్రోత్సవాలతో శనివారం హైదరాబాద్‌ మొత్తం త్రివర్ణ శోభితమైంది. చిన్నా, పెద్ద అనే తేడా లేదు. కార్మికుడు, అధికారి కలిసిపోయారు. ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమయ్యారు. పేద, ధనిక, కులం, మతం అనే తరాతమ్యాలు లేకుండా ఎక్కడ చూసినా జాతీయ పతాకాలే.

Published : 14 Aug 2022 06:41 IST

మువ్వన్నెల వెలుగుల్లో శాసనసభ భవనం

ఈనాడు, హైదరాబాద్‌: స్వతంత్ర భారత వజ్రోత్సవాలతో శనివారం హైదరాబాద్‌ మొత్తం త్రివర్ణ శోభితమైంది. చిన్నా, పెద్ద అనే తేడా లేదు. కార్మికుడు, అధికారి కలిసిపోయారు. ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమయ్యారు. పేద, ధనిక, కులం, మతం అనే తరాతమ్యాలు లేకుండా ఎక్కడ చూసినా జాతీయ పతాకాలే. నగరవ్యాప్తంగా దాదాపు లక్ష మంది పౌరులు వేర్వేరు ప్రాంతాల్లో సమైక్య ర్యాలీ తీశారు. ట్యాంక్‌బండ్‌పై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వేర్వేరు శాఖల అధికార యంత్రాంగం, జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు యంత్రాంగం భారీ ర్యాలీ తీశాయి. నగరవ్యాప్తంగా 10లక్షలకుపైగా జెండాలను పంపిణీ చేశామని, పంద్రాగస్టు నాటికి 20లక్షల జెండాలను పంచుతామని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది.

ఎల్బీస్టేడియంలో జరిగే వజ్రోత్సవాల ముగింపు సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఉత్సవాల కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు. మంత్రులు శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌

నేడు బాణసంచా వెలుగులు..
రోజువారీ కార్యాచరణలో భాగంగా ఆదివారం జానపద కళాకారుల ప్రదర్శనలు ఉండనున్నాయి. రాత్రి పది గంటలకు ట్యాంక్‌బండ్‌ పీపుల్స్‌ ప్లాజా నుంచి పీవీమార్గ్‌ ద్వారా ట్యాంక్‌బండ్‌ వరకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పది నిమిషాలపాటు బాణసంచా కాల్చనున్నారు.

‘సండే-ఫన్‌ డే’ నేటి నుంచి
కరోనాతో ట్యాంక్‌బండ్‌పై ఆగిపోయిన ‘సండే - ఫన్‌ డే’ ఆదివారం నుంచి పునఃప్రారంభం కానుంది. ఇక నుంచి ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం చేపట్టాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆదివారం సా.4 గంటల నుంచి ట్రాఫిక్‌ నిలిపివేయనున్నారు.  

 


చిలకలగూడ చౌరస్తా నుంచి ఆర్‌ఆర్సీ మైదానం వరకు 750 మీటర్ల పొడవైన జాతీయ పతాకం ప్రదర్శన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని