logo

అబ్బుర విన్యాసాలు.. ఆయుధాల ప్రదర్శనలు

సాహసోపేత విన్యాసాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రణరంగంలో ఆయుధాల ప్రదర్శనతో తెలంగాణ ఆంధ్ర సబేరియా (టాసా) ఆధ్వర్యంలో ప్రారంభించిన మెగా ఈవెంట్‌ వేడుక ఆహుతుల్ని ఆకట్టుకుంది.

Updated : 14 Aug 2022 05:31 IST

కంటోన్మెంట్‌: సాహసోపేత విన్యాసాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రణరంగంలో ఆయుధాల ప్రదర్శనతో తెలంగాణ ఆంధ్ర సబేరియా (టాసా) ఆధ్వర్యంలో ప్రారంభించిన మెగా ఈవెంట్‌ వేడుక ఆహుతుల్ని ఆకట్టుకుంది. సామాన్య పౌరుల్లో ధైర్య సాహసాలు, దేశంపై అంకితభావాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా టాసా ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో రెండు రోజలపాటు జరుగనున్న మెగా ఈవెంట్‌ వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. టాసా జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ (జీవోసీ), మేజర్‌ జనరల్‌ రంజిత్‌సింగ్‌ మన్రాల్‌ ముఖ్యఅతిథిగా హాజరై ఈవెంట్‌ ప్రారంభించారు. వీర సైనికులు మోటర్‌ సైకిళ్లపై చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. టీ-72 యుద్ధ నౌకలు, యుద్ధాల్లో వినియోగించే ఆయుధాలు, ట్రాన్స్‌పోర్టు వెంటిలేటర్‌, కమ్యూనికేషన్‌ వాహనాలు, 81ఎంఎం మోర్టార్‌, రాకెట్‌ లాంఛర్ల పని తీరు తెలుసుకునేందుకు పౌరులు ఉత్సుకత చూపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని