logo

బీన్స్‌ కిలో రూ.115

కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రైతుబజార్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా బీన్స్‌ ధర కిలో రూ.115గా రికార్డుకెక్కింది. కొన్నిరోజులుగా పెరుగుతూ వస్తున్న బీన్స్‌ కిలో ధర శనివారం నాటికి ఏకంగా రూ.115కు చేరింది. ఇక బహిరంగ మార్కెట్లు

Published : 14 Aug 2022 03:03 IST

అమీర్‌పేట, మెహిదీపట్నం, న్యూస్‌టుడే: కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రైతుబజార్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా బీన్స్‌ ధర కిలో రూ.115గా రికార్డుకెక్కింది. కొన్నిరోజులుగా పెరుగుతూ వస్తున్న బీన్స్‌ కిలో ధర శనివారం నాటికి ఏకంగా రూ.115కు చేరింది. ఇక బహిరంగ మార్కెట్లు, సూపర్‌ మార్కెట్లలోకిలో బీన్స్‌ రూ.150-175 వరకు విక్రయిస్తున్నారు. బీన్స్‌తోపాటు చిక్కుడు కిలో రూ.70కి రైతుబజార్‌లో అమ్ముతున్నారు. గతంలో తీవ్రమైన ఎండల కారణంగా పంట దిగుబడి తగ్గిపోవడంతో పెరిగిన బీన్స్‌ ధర ప్రస్తుతం భారీ వర్షాలకు దిగుబడి తగ్గిపోయిందని ఎర్రగడ్డ రైతుబజార్‌ ఎస్టేట్‌ అధికారి రమేష్‌ తెలిపారు. రికార్డు స్థాయికి చేరుకున్న బీన్స్‌ ధర మరికొంత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేలో కూడా బీన్స్‌ ధర్‌ రూ.105 పలికింది.
* మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌ పరిసర గ్రామాల్లో ఎక్కువగా పండే బీన్స్‌ నగర మార్కెట్‌ను చేరుతుంటుంది. బెంగళూరు నుంచి హైబ్రీడ్‌ రకం బీన్స్‌ రైతుబజార్‌లకు తీసుకొస్తుంటారు. ప్రస్తుతం స్థానిక రైతులు, బెంగళూరు నుంచి కూడా బీన్స్‌ రావడం లేదు. ఎర్రగడ్డ రైతుబజార్‌కు సాధారణ రోజుల్లో 80-100 క్వింటాళ్ల వరకు బీన్స్‌ వస్తుంటుంది. ప్రస్తుతం రోజుకు 10-12 క్వింటాళ్ల వరకు సరిగా రావడం లేదు. ఉదయం గంట వ్యవధిలోనే బీన్స్‌ డిమాండ్‌తో అమ్ముడుపోతోంది.
* మెహిదీపట్నం రైతుబజార్‌లో జులై ఒకటిన కిలో బీన్స్‌ రూ.95గా రైతుబజార్‌లో నమోదైంది. తర్వాత తగ్గుతూ వచ్చింది. ఈనెల 10న రూ.75, 11న రూ.90కి చేరింది. శనివారం రూ.100 దాటి రూ.115గా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని