logo

ఫ్లాగ్‌ కోడ్‌ గురించి తెలుసా..?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రతి ఇంటిపై ఎగురవేసేందుకు జాతీయ పతాకాల పంపిణీ చేపట్టారు. గ్రేటర్‌ పరిధిలో 20 లక్షల జెండాల లక్ష్యంగా పంపిణీ మొదలైంది.

Updated : 14 Aug 2022 11:58 IST

 జాతీయ జెండాను అవమానిస్తే చర్యలు
గ్రేటర్‌ పరిధిలో త్రివర్ణ పతాకాల పంపిణీ


 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రతి ఇంటిపై ఎగురవేసేందుకు జాతీయ పతాకాల పంపిణీ చేపట్టారు. గ్రేటర్‌ పరిధిలో 20 లక్షల జెండాల లక్ష్యంగా పంపిణీ మొదలైంది. ఈ నెల 13 నుంచి 15 వరకు ఎగురేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ‘ఫ్లాగ్‌ కోడ్‌’ గురించి తెలుసుకోవాలి.
నిబంధనలు పాటించాలి
ప్రతి ఒక్కరూ ఫ్లాగ్‌ కోడ్‌ 2002ను అనుసరించాలి. యాంటీ డిఫమేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ సింబల్స్‌ యాక్ట్‌-1971 నిబంధనలు పాటించాలి. కోడ్‌లోని 2.1 నిబంధన ప్రకారం జాతీయ జెండాపై గౌరవభావంతో సాధారణ పౌరులు ఏ ప్రదేశంలోనైనా ఎగురవేయొచ్చు. కానీ పతాకాన్ని అవమానిస్తే మొదటి తప్పుకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. 2002 జనవరి 26న కొత్త కోడ్‌ అమల్లోకి వచ్చింది. అంతకుముందు నేషనల్‌ సింబల్స్‌ అండ్‌ నేమ్స్‌ యాక్ట్‌-1950, యాంటీ డిఫమేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ సింబల్స్‌ యాక్ట్‌-1971 ఉండేవి. ఇటీవల ఈ కోడ్‌లో రెండు ప్రధాన మార్పులు చేశారు.

రాత్రి కూడా  ఎగురవేయొచ్చు...
* 2022 జులై 20న చేసిన సవరణ ప్రకారం.. పతాకాన్ని పగలు, రాత్రి కూడా ఎగురవేయొచ్చు. బహిరంగ ప్రదేశంలో, ఇంటిపై ఎగురవేసేందుకు అనుమతి ఉంది. ఇంతకుముందు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే ఎగురవేయడానికి అనుమతి ఉండేది.
* త్రివర్ణ పతాకాన్ని పాలిస్టర్‌ ఫ్యాబ్రిక్‌తో తయారు చేయడానికి 2021 డిసెంబర్‌ 30 నుంచి అనుమతించారు. గతంలో ఖాదీ వస్త్రంతో మాత్రమే తయారుచేయడానికి అనుమతి ఉండేది.

ఇవి  గుర్తుంచుకోండి..
*చిరిగిన, నలిగిన, తిరగబడిన జెండాను ఎగురేయొద్దు.
* పతాకాన్ని ఎగరేసే ఎత్తులో, అంతకంటే ఎక్కువ ఎత్తులో మరే జెండా ఉండొద్దు
* జెండాను అలంకరణకు ఉపయోగించకూడదు.
* కాషాయ రంగు పైకి ఉండాలి.
* ధ్వజస్తంభం మీద లేదా జెండాపైన పూలు, ఆకులు, దండలు పెట్టొద్దు.

* పతాకంపై ఏం రాయకూడదు..ఏ వస్తువు మీద కప్పవద్దు
* ఎగురేసేందుకు సిద్ధం చేస్తున్నప్పుడు అందులో పువ్వులు ఉంచొచ్చు.

* త్రివర్ణ పతాకాన్ని నేలపై పడేయకూడదు. నీటిపై తేలనీయొద్దు.
* దుస్తులుగా కుట్టించుకోవద్దు. నడుము కింది భాగంలో చుట్టుకోవద్దు. రుమాలు, న్యాప్‌కిన్‌గా ఉపయోగించొద్దు.
* ఎగురవేసేటప్పుడు అది ధ్వజస్తంభానికి కుడివైపున ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని