logo

జిల్లాలకు బస్సులు.. నగరంలో తిప్పలు

వరుస సెలవులు రావడంతో నగరవాసులు సొంతూళ్లకు వెళ్లారు. రెండో శనివారం, ఆదివారం, సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఉద్యోగులు, విద్యార్థులకు సెలవులు వచ్చాయి. నగరం నుంచి తెలంగాణలోని

Published : 14 Aug 2022 03:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: వరుస సెలవులు రావడంతో నగరవాసులు సొంతూళ్లకు వెళ్లారు. రెండో శనివారం, ఆదివారం, సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఉద్యోగులు, విద్యార్థులకు సెలవులు వచ్చాయి. నగరం నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాలతోపాటు విజయవాడ, కర్నూలు ప్రాంతాలకు ప్రత్యేకంగా బస్సులు నడిపించారు. శుక్ర, శనివారాల్లో దాదాపు 450 ప్రత్యేక బస్సులు పంపించారు. వరంగల్‌వైపు వెళ్లే వారికి ఉప్పల్‌ నుంచి.. విజయవాడ వెళ్లే వారికి ఎల్బీనగర్‌, ఎంజీబీఎస్‌ నుంచి.. సీబీఎస్‌, ఆరాంఘర్‌ నుంచి కర్నూలు వెళ్లే ప్రయాణికుల కోసం బస్సులు ఏర్పాటు చేశారు. నగర డిపోలకు చెందిన బస్సులను ఆయా ప్రాంతాలకు పంపించడంతో ఇక్కడ తిరిగే సర్వీసులలో కోత పడింది.  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్డినరీ బస్సులు రద్దీగా కనిపించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని