logo

Hyderabad News: ఇంజినీరింగ్‌ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం

బాచుపల్లిలోని బీవీఆర్‌ఐటీ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన చివరి సంవత్సరం విద్యార్థినులు భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు.వారం రోజుల కిందట కళాశాలలో ప్రాంగణ నియామకాలు చేపట్టాయి. వీటిల్లో పాలొఆల్తో సంస్థ ఐటీ విద్యార్థిని

Updated : 14 Aug 2022 10:07 IST

సంజనరెడ్డిని అభినందిస్తున్న డా.కె.వి.ఎన్‌.సునీత

దుండిగల్‌, న్యూస్‌టుడే: బాచుపల్లిలోని బీవీఆర్‌ఐటీ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన చివరి సంవత్సరం విద్యార్థినులు భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు.వారం రోజుల కిందట కళాశాలలో ప్రాంగణ నియామకాలు చేపట్టాయి. వీటిల్లో పాలొఆల్తో సంస్థ ఐటీ విద్యార్థిని సంజనరెడ్డికి రూ.54.75 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్‌ చేసింది. మరో విద్యార్థిని నీరజకు రూ.49.25 లక్షల వార్షిక వేతనంతో మైక్రోసాఫ్ట్‌, శివాని, వైష్ణవి, ప్రవళికకు అమెజాన్‌ సంస్థ రూ.44 లక్షల వార్షిక వేతనం, అడోబీ రూ.40.2 లక్షల వార్షిక వేతనంతో సౌమ్యకు ఉద్యోగావకాశాలు కల్పించాయి. రూ.30 లక్షలకు పైగా వార్షిక వేతనంతో 10 మంది విద్యార్థినులు వివిధ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు పొందారు. శనివారం విద్యార్థిని సంజనరెడ్డిని కళాశాల ప్రిన్సిపల్‌ డా.కె.వి.ఎన్‌.సునీత అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని