logo

ఇక రవాణా రంగ భవిష్యత్‌ అంతా ఎలక్ట్రిక్ మొబిలిటీపైనే!

నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రిక్‌ మొబిలిటినీ మరింత విస్తృతం చేస్తుందని టి-హబ్‌ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు అన్నారు.

Updated : 14 Aug 2022 15:39 IST

హైదరాబాద్‌: నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రిక్‌ మొబిలిటినీ మరింత విస్తృతం చేస్తుందని టి-హబ్‌ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు అన్నారు. 75వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఎల‌క్ట్రిక‌ల్ వెహికిల్స్‌పై అవగాహన కల్పించడానికి ట్రైడ్ మొబిలిటీ ఆదివారం హైదరాబాద్‌లో ‘ఈవీ రైడ్ విత్ ప్రైడ్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇప్పుడు స్థిరంగా ఉండ‌బోతోంది. ఇది రవాణా రంగ భవిష్యత్తును సూచిస్తుంది. ఇది మరింత సమర్థ, పర్యావరణ అనుకూల‌, స్థిరమైన రవాణా మార్గం. టి-హ‌బ్‌లో ఇంక్యుబేట్ అయిన స్టార్ట‌ప్ ట్రైడ్ మొబిలిటీ వారి టెక్నాలజీ ఆధారిత ప్లాట్ ఫారం ద్వారా ప‌రిశుభ్ర‌మైన ర‌వాణా మార్గాల‌ను ప్రోత్సహించడానికి ఎంతగానో సహాయపడుతుంది” అని చెప్పారు.

ఈ ర్యాలీలో 15కు పైగా ప్రముఖ ఈవీ టూ వీలర్ బ్రాండ్ల నుంచి 50 మందికి పైగా రైడర్లు పాల్గొన్నారు. తెలుగుత‌ల్లి ఫ్లైఓవర్ నుంచి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఎల‌క్ట్రిక‌ల్ వెహికిల్స్‌పై ప‌రిశుభ్ర‌మైన ఇంధ‌న ప‌రిష్కారాల‌ను ఎలా అందిస్తాయ‌నే బలమైన సందేశాన్ని ఇచ్చారు.  ట్రైడ్ మొబిలిటీ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈవో మాధ‌వ్ అప్పిరెడ్డి మాట్లాడుతూ, “ఈ కార్య‌క్ర‌మంలో, స్వ‌చ్ఛ ర‌వాణా అవ‌కాశాల‌ను ప్రోత్సహించే లక్ష్యంతో విభిన్న ఈవీ బ్రాండ్ల నుంచి సమష్టి భాగస్వామ్యం, సహకారాన్ని మేం చూశాం. మా ఈవీ రైడ్స్ బీ2బీ ఎస్ఏఏఎస్ ప్లాట్ ఫారం ద్వారా, ఓఏఎంలు మరియు ఈవీ ఛానల్ భాగస్వాములకు వారి కస్టమర్ల‌ ప్రయాణాన్ని డిజిటలైజ్ చేయడానికి, వారి ఎండ్-టు-ఎండ్ సప్లై చైన్ కార్యకలాపాలను నిర్వహించడానికి మేం సాధికారతను కల్పిస్తున్నాం. మేము ప్రస్తుతం మా ఎండ్-టు-ఎండ్ ఎస్ఏఏఎస్ పరిష్కారాలను అందించే ఈ రంగంలో 15కుపైగా బ్రాండ్లతో పనిచేస్తున్నాము” అని తెలిపారు.

‘భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడటానికి మనమందరం ఏకం కావాల్సిన సమయం ఇదేనని, వినియోగ‌దారులు మరింత ఆత్మవిశ్వాసంతో  ఎల‌క్ట్రిక‌ల్ వెహికిల్స్‌ను సుల‌భంగా వాడ‌టానికి, ఈవీ వ్య‌వ‌స్థ‌ను డిజిటలైజ్ చేయడానికి, ట్రైడ్ మొబిలిటీలో మేం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని ట్రైడ్ మొబిలిటీ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఓఓ క్రాంతికుమార్  అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని