Telangana News: వీడని ముసురు.. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు 

Published : 14 Aug 2022 16:05 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా చిరు జల్లులు పడుతుండటంతో వివిధ పనుల కోసం బయటకు వచ్చిన ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. రానున్న మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు. ఎల్లుండి కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. 

ఉత్తర బంగాళా ఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు వాయుగుండంగా బలపడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఇది వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ వాయుగుండం రానున్న 6గంటలలో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని  వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని