logo

ట్యాంక్‌బండ్‌పై హుషారుగా సండే- ఫన్‌ డే

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సండే- ఫన్‌ డే సందర్శకులతో కిటకిటలాడింది. కరోనాతో నిలిచిపోయిన కార్యక్రమం ఆదివారం  పునఃప్రారంభమైంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని విద్యుత్తు

Updated : 15 Aug 2022 04:14 IST

రాంనగర్‌,  న్యూస్‌టుడే: హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సండే- ఫన్‌ డే సందర్శకులతో కిటకిటలాడింది. కరోనాతో నిలిచిపోయిన కార్యక్రమం ఆదివారం  పునఃప్రారంభమైంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని విద్యుత్తు దీపాలు, జాతీయ జెండాలతో పరిసరాలను అలంకరించారు. తేలికపాటి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కుటుంబ సభ్యులతో సందడి చేశారు. తినుబండారాలను కొనుగోలు చేసి ఆనందంగా గడిపారు. పలువురు జాతీయ జెండాలను చేతబూని సెల్ఫీలు దిగారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో సందర్శకులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు. పోలీసులు మైక్‌లో అనౌన్స్‌మెంట్‌ చేస్తూ సందర్శకులకు సూచనలు చేశారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ను అనుమతించలేదు. వాహనాలను అంబేడ్కర్‌ విగ్రహం కూడలి నుంచి లిబర్టీ, హిమాయత్‌నగర్‌ల వైపు పంపించారు. డీబీఆర్‌ మిల్లు నుంచి ట్యాండ్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలను డీబీఆర్‌ మిల్లు వద్ద ఉన్న గోశాల, కవాడిగూడ, బైబిల్‌ హౌస్‌ల మీదుగా మళ్లించారు. ఆగస్టు 16న ఉదయం 11.30 గంటలకు జాతీయ గీతాలాపనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని