logo

ఉన్నత స్థాయికి వెళ్లలేదని ఆత్మహత్య

ఉన్నతంగా చదివి మంచి ఉద్యోగం చేయాలనే తపన నెరవేరలేదని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడిన ఘటన పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది.

Published : 15 Aug 2022 03:16 IST

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: ఉన్నతంగా చదివి మంచి ఉద్యోగం చేయాలనే తపన నెరవేరలేదని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడిన ఘటన పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. ఏఎస్సై సురేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌కు చెందిన భెల్‌ టౌన్‌షిప్‌లో ప్రభుత్వ పాఠశాలలో అటెండర్‌గా నర్సింహులు పనిచేస్తూ పటాన్‌చెరు శ్రీనగర్‌కాలనీ ఉంటున్నారు.  ఇతను పెద్దకుమారుడు ప్రదీప్‌ (25) బీటెక్‌ చదివి మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతను ఎంటెక్‌ చదివి ఉన్నతస్థాయి ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు. అది నెరవేరకపోవడంతో మూడురోజులుగా ముభావంగా ఉంటున్నాడు. ఆదివారం ఇంట్లో ఉరిపోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని