logo

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రాంతంలోని అచ్చిరెడ్డినగర్‌కు చెందిన ముగ్గురు యువకులు నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా శనివారం తెల్లవారుజామున కామారెడ్డి

Published : 15 Aug 2022 03:16 IST

భిక్కనూరు, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రాంతంలోని అచ్చిరెడ్డినగర్‌కు చెందిన ముగ్గురు యువకులు నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా శనివారం తెల్లవారుజామున కామారెడ్డి జిల్లా జంగంపల్లి శివారులో 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ఘటనలో జిబ్రిల్‌ మహ్మద్‌(19), మహ్మద్‌ జహంగీర్‌, అలీ అర్బాజ్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మొదట జిల్లా ఆస్పత్రికి, తరువాత హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలైన జిబ్రిల్‌ మహ్మద్‌ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడని ఎస్సై ఆనంద్‌గౌడ్‌ తెలిపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts