logo

నిజాం వ్యతిరేక పోరాటంలో ఎన్నో కష్టాలు పడ్డాం

భారత స్వాతంత్య్ర, నిజాం వ్యతిరేక పోరాటంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నామని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు మానెం రంగనాయకమ్మ పేర్కొన్నారు. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ను పురస్కరించుకుని కోఠిలోని

Published : 15 Aug 2022 03:16 IST

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: భారత స్వాతంత్య్ర, నిజాం వ్యతిరేక పోరాటంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నామని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు మానెం రంగనాయకమ్మ పేర్కొన్నారు. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ను పురస్కరించుకుని కోఠిలోని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ప్రాంతీయ ప్రధాన కార్యాలయంలో ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగోలుకు చెందిన మానెం రంగనాయకమ్మ(99) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకు  ఆవరణలో.. దేశ విభజన, స్వాతంత్య్ర అనంతరం ఘట్టాలతో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన చిత్ర ప్రదర్శనను బ్యాంక్‌ జీఎం మంజుశర్మతో కలిసి ప్రారంభించారు. అనంతరం వాటిని ఆమె తిలకిస్తూ, భావోద్వేగంతో వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. జీఎం మంజుశర్మ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని తెలిపారు. అనంతరం మానెం రంగనాయకమ్మతో పాటు పలువురు స్వాతంత్ర సమరయోధులు, సీనియర్‌ సిటిజన్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బ్యాంక్‌ డీజీఎంలు శ్రీరాంసింగ్‌, జితేందర్‌శర్మ, ఏజీఎంలు అనిల్‌కుమార్‌, పల్లంరాజు (పీఆర్‌)లతో పాటు బ్యాంక్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు