logo

బీసీల డిమాండ్లు పరిష్కరించాలి

బీసీల డిమాండ్లు పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.  బీసీలకు రాజకీయ రంగంలో 14 శాతం, ఉద్యోగ రంగంలో 16, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో 1, ఉన్నత

Published : 15 Aug 2022 03:16 IST

గోల్నాక, న్యూస్‌టుడే: బీసీల డిమాండ్లు పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.  బీసీలకు రాజకీయ రంగంలో 14 శాతం, ఉద్యోగ రంగంలో 16, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో 1, ఉన్నత న్యాయస్థానాల్లో 2, ప్రైవేటు ఉద్యోగాల్లో 5 శాతం మాత్రమే చోటు దక్కిందన్నారు. ఆదివారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు పలు పార్టీల నేతలతోపాటు 92 మంది పార్లమెంటు సభ్యులను కలిసినట్లు తెలిపారు. నేతలు కోలా జనార్దన్‌, రామ్‌కోటి, బీరయ్యయాదవ్‌, గుండేటి శంకర్‌, ఉదయ్‌నేత, హేమంత్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని