logo

‘ఇంటి భోజనానికి దూరమైతే ఆసుపత్రికి దగ్గరైనట్లే’

ఎక్కువ శాతం ప్రజలు ఇంటి భోజనానికి దూరమై, బయట ఆహారానికి అలవాటుపడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోగ్య రంగ నిపుణుడు డా.ఖాదర్‌వలి అన్నారు.

Published : 15 Aug 2022 03:16 IST

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: ఎక్కువ శాతం ప్రజలు ఇంటి భోజనానికి దూరమై, బయట ఆహారానికి అలవాటుపడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోగ్య రంగ నిపుణుడు డా.ఖాదర్‌వలి అన్నారు. రైతునేస్తం ఫౌండేషన్‌, కర్షక సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ‘చిరు ధాన్యాలతో వంటకాలు’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మిల్లెట్స్‌ రాంబాబు చిరుధాన్యాల వంటకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ‘పాకసిరి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రైతునేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు సమన్వయకర్తగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని