logo

బీసీలకు గుర్తింపు ఇచ్చింది కేసీఆరే

రాష్ట్రంలోని బీసీలను గుర్తించింది.. వారి ఆత్మ గౌరవాన్ని పెంచింది ముఖ్యమంత్రి కేసీఆరేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.  ఉప్పల్‌ భగాయత్‌లో

Published : 15 Aug 2022 03:16 IST

ఉప్పల్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని బీసీలను గుర్తించింది.. వారి ఆత్మ గౌరవాన్ని పెంచింది ముఖ్యమంత్రి కేసీఆరేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.  ఉప్పల్‌ భగాయత్‌లో ఆదివారం సోమ వంశ సహస్రార్జున క్షత్రియ(పట్కార్‌) ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమిపూజకు ముఖ్య అతిథులుగా ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..   బీసీలకు అండగా కేసీఆర్‌ ప్రభుత్వం నిలిచిందన్నారు. బీసీల అభివృద్ధి, సంక్షేమం, ఇతర అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.   కార్యక్రమంలో పట్కార్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.విశ్వనాథ్‌ రవీందర్‌, మాజీ ఎమ్మెల్యేలు షికారి విశ్వనాథం, కె.అశోక్‌, ప్రతినిధులు కె.శ్రీనివాస్‌, రాంచందర్‌, విశ్వనాథ్‌ బాలకిషన్‌ పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts