logo

సీఎం పర్యటనకు.. పటిష్ఠ ఏర్పాట్లు: ఎస్పీ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా పోలీసు అధికారి ఎన్‌.కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ రషీద్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

Published : 15 Aug 2022 03:16 IST

1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు

మాట్లాడుతున్న కోటిరెడ్డి

వికారాబాద్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా పోలీసు అధికారి ఎన్‌.కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ రషీద్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బందోబస్తు నిమిత్తం జిల్లా పోలీసు బలగాలతో పాటు మహబూబ్‌నగర్‌, గద్వాల్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట్‌, నల్గొండ, సూర్యపేట, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల నుంచి నలుగురు ఎస్పీలతో పాటు 6 మంది ఏఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 63 మంది సీఐలు, 146 మంది ఎస్‌ఐలు, 1,367 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటారని చెప్పారు. వీరు కాకుండా 7 ప్రత్యేక బృందాలతో నిఘా వేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటామన్నారు.

వాహనాలను నిలిపే ప్రదేశాలు ఇవే..
ఆలంపల్లి, నవాబుపేట, తాండూర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను నిలుపడానికి ఎన్టీఆర్‌ చౌరస్తా మీదుగా ఎన్నెపల్లి ఎక్స్‌ రోడ్‌ నుంచి భృంగీ పాఠశాల పక్కన ఖాళీ స్థలం, ఎల్లమ్మతోట, చెన్నమ్మతోటల్లో నిలపాలి.  ః హైదరాబాద్‌ నుంచి చేవెళ్ల మీదుగా వచ్చే వాహనాలను మహవీర్‌ ఆస్పత్రి మార్గం గుండా సూర్యప్రకాష్‌నగర్‌ కాలనీ, టీచర్స్‌ కాలనీల్లో నిలపాలి.  ః కొడంగల్‌, పరిగి వైపు నుంచి వచ్చే వాహనాలను డీటీసీ, నిర్మిస్తున్న జడ్పీ నూతన ప్రాంగణం, పాత హెలీప్యాడ్‌లో నిలపడానికి కేటాయింపు.ః ప్రముఖ నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, పురపాలక అధ్యక్షులు, కౌన్సిలర్ల వాహనాల కోసం నూతన కలెక్టర్‌ కార్యాలయం సమీపంలోని లేఆవుట్‌లో స్థలం కేటాయింపు.

దారి మళ్లింపు..: 16న తాండూర్‌ నుంచి వికారాబాద్‌ మీదుగా హైదరాబాద్‌, పరిగి నుంచి వికారాబాద్‌కు వచ్చే వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు. తాండూర్‌ నుంచి కొడంగల్‌, పరిగి, మన్నెగూడ మీదుగా, హైదరాబాద్‌ నుంచి తాండూర్‌ వెళ్లే వాహనాలను కూడా అదే మార్గంలో దారి మళ్లించనున్నారు. వికారాబాద్‌- పరిగి మధ్య వాహనాల రాకపోకలకు అనుమతి లేదు.

పాస్‌లు ఉన్న వారికే అనుమతి..
ముఖ్యమంత్రి సభకు వచ్చే ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు తమకు జారీ చేసిన పాస్‌లను తప్పనిసరిగా తీసుకురావాలి. లేకుంటే అనుమతి లేదు. ఇందుకు ప్రజలు గమనించి, సహకరించాలని కోరారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts