logo

సామాజిక న్యాయ శాఖ ద్వారా దివ్యాంగులకు తోడ్పాటు

దివ్యాంగులు చిన్న పాటి పనులకు ఇతరులపై ఆధారపడకుండా ప్రధాని మోదీ ఆలోచన మేరకు సామాజిక న్యాయ శాఖ ద్వారా బ్యాటరీ ట్రైసైకిళ్లు, సాధారణ ట్రైసైకిళ్లు, వీల్‌ ఛైర్లు, చేతి కర్రలు, సెల్‌ఫోన్లు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Published : 17 Aug 2022 01:54 IST


దివ్యాంగుల పరికరాలు అందజేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: దివ్యాంగులు చిన్న పాటి పనులకు ఇతరులపై ఆధారపడకుండా ప్రధాని మోదీ ఆలోచన మేరకు సామాజిక న్యాయ శాఖ ద్వారా బ్యాటరీ ట్రైసైకిళ్లు, సాధారణ ట్రైసైకిళ్లు, వీల్‌ ఛైర్లు, చేతి కర్రలు, సెల్‌ఫోన్లు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఖైరతాబాద్‌లోని సరస్వతీ విద్యా మందిర్‌ పాఠశాలలో దివ్యాంగులకు పరికరాలు అందజేశారు.  వికలాంగుల సంఘం నేతలు కొల్లి నాగేశ్వర్‌రావు, శ్రీనివాస్‌, భాజపా నాయకులు గౌతంరావు, ప్రేమ్‌రాజ్‌, ఆదర్శ్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని