logo

సంపదను సృష్టించాలి

సంపదను సృష్టించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని గాంధీజీ సిద్ధాంతాల ప్రచారకర్త, సామాజిక ఉద్యమకారుడు బిరాద్‌ రాజారామ్‌ యాజ్నిక్‌ విద్యార్థులకు సూచించారు.

Published : 17 Aug 2022 01:54 IST


విజేతలతో బిరాద్‌ రాజారామ్‌ యాజ్నిక్‌, లక్ష్మీనివాస్‌శర్మ, శ్రీకిషన్‌బద్రుకా, అభిరామకృష్ణ, మోహన్‌కుమార్‌ తదితరులు

కాచిగూడ, న్యూస్‌టుడే: సంపదను సృష్టించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని గాంధీజీ సిద్ధాంతాల ప్రచారకర్త, సామాజిక ఉద్యమకారుడు బిరాద్‌ రాజారామ్‌ యాజ్నిక్‌ విద్యార్థులకు సూచించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కాచిగూడలోని బద్రుకా కామర్స్‌ కళాశాల ఆధ్వర్యంలో ‘రేపటి భారత దేశంలో యువత పాత్ర’ అంశంపై ఆయన మాట్లాడారు. భావితరాలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. క్రీడా పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల నాటక ప్రదర్శన ఆకట్టుకుంది. ఛైర్మన్‌ లక్ష్మీనివాస్‌శర్మ, కార్యదర్శి శ్రీకిషన్‌బద్రుకా, డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ అభిరామకృష్ణ, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మోహన్‌కుమార్‌, వైస్‌ ప్రిన్సిపళ్లు డాక్టర్‌ జానకిరామ్‌, డాక్టర్‌ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని