logo

సీఎండీ సమన్వయంతోనే 24 గంటల విద్యుత్తు

రాష్ట్రంలో విద్యుత్తు సంస్థల అభివృద్ధికి ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సమన్వయమే కారణమని రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగుల ఫోరం పేర్కొంది. మంగళవారం ఫోరం ప్రతినిధులు మల్లేశం, శ్రీనివాస్‌ సీఎండీని ఆయన కార్యాలయంలో సత్కరించారు.

Published : 17 Aug 2022 01:54 IST


ప్రభాకర్‌రావుకు జ్ఞాపికను అందజేస్తున్న ఫోరం ప్రతినిధులు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో విద్యుత్తు సంస్థల అభివృద్ధికి ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సమన్వయమే కారణమని రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగుల ఫోరం పేర్కొంది. మంగళవారం ఫోరం ప్రతినిధులు మల్లేశం, శ్రీనివాస్‌ సీఎండీని ఆయన కార్యాలయంలో సత్కరించారు. ఇదే స్ఫూర్తితో విధులు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డికి పాత పెన్షన్‌పై వినతిపత్రం అందజేశారు. సీఎండీలను కలిసిన వారిలో ఫోరం ప్రతినిధులు సురేష్‌బాబు, ప్రేమ్‌కుమార్‌, చక్రవర్తి, విజయ్‌, శివకృష్ణప్రసాద్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని